మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు: విడదల రజని



పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – విడదల రజని 

చిలకలూరిపేట: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా చిలకలూరిపేటలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రి  విడదల రజిని  ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ, సమాజంలో నెలకొన్న కుల వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, విద్య, మహిళా సాధికారత, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటం, సమాజ మార్పు కోసం చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.మహాత్మా పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమానత్వం, సామాజిక న్యాయం, విద్యాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పూలే చూపిన మార్గంలో నడుస్తూ వివక్షలేని సమాజ నిర్మాణానికి కృషి చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని తెలిపారు.

Post a Comment

Previous Post Next Post

Convert JPG

✂ Image Crop & HD Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

✨ HD Preview & Resize

New Width (px): Height: 0px