దివంగత ప్రముఖ సినీ నటుడు గిరిబాబుకు ప్రత్తిపాటి పుల్లారావు ఘన నివాళి.. కుటుంబ సభ్యులకు పరామర్శ


కోరిశపాడు (ప్రకాశం జిల్లా): దివంగత ప్రముఖ సినీ నటులు యర్రా శేషగిరిరావు (గిరిబాబు) పెద్దకర్మ కార్యక్రమం ప్రకాశం జిల్లా, కోరిశపాడు మండలం, రావినూతల గ్రామంలోని ఆయన స్వగృహంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరై గిరిబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజ్యసభ సభ్యులు బాష్యం రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కరణం బలరాంలతో కలిసి గిరిబాబు కుమారుడు, ప్రముఖ నటుడు రఘుబాబును, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. గిరిబాబు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర రంగంలో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా గిరిబాబు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.


Post a Comment

Previous Post Next Post

Convert JPG

✂ Image Crop & HD Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

✨ HD Preview & Resize

New Width (px): Height: 0px