చిలకలూరిపేట :అత్యంత వివాదాస్పదమైన ప్రమాదకరమైన డీలిమిటేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే దక్షిణ భారతదేశ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ అన్నారు. ఈ బిల్లు విషయంలో స్వార్థ ప్రయోజనాలు విడనాడి దక్షిణ భారతదేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ పార్టీల నేతలు అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు ఐక్యంగా . డిలిమిటేషన్ బిల్లును తిప్పి కొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తర భారత దేశంలో జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలు రెట్టింపు అవుతున్నాయని అదే సమయంలో దక్షిణ భారతదేశంలో జనాభా నియంత్రణ పాటించిన కారణంగా జనసంఖ్య లేక అతి తక్కువ సంఖ్యలో నియోజకవర్గాల పెరుగుదల జరుగుతుందని అన్నారు. దీని కారణంగా దక్షిణ భారతదేశము నుండి ఒక పార్లమెంటు సభ్యుడు మద్దతు ఇవ్వకపోయినా ఉత్తర భారత దేశ పార్లమెంట్ సభ్యుల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బిజెపి కుట్రను గమనించి చైతన్యవంతులైన దక్షిణ భారతదేశ పార్లమెంట్ సభ్యులు ఒక్కటై తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. డీ లిమిటేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే ఉత్తర భారత దేశ ఆధిపత్యం క్రింద దాక్షిణాత్యులు బానిసత్వం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందారు. దక్షిణ భారతీయులను బానిసలుగా మార్చడం కోసమే భారతీయ జనతా పార్టీ డీ లిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని చూస్తుందని ఆరోపించారు. రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో ఇండియా కూటమి భవిష్యత్తులో ఏర్పడబోయే ప్రమాదాన్ని గుర్తించి దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఆలోచనతోనే డీ లిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నారని అన్నారు ఇదే పరిస్థితి కొనసాగిత దేశ సమైక్యత సమగ్రతలకు ప్రమాదం ఏర్పడుతుందని రెండు దేశాలుగా విడిపోయే ప్రమాదం కూడా ఉంటుందని వాస్తవాన్ని విజ్ఞులైన పార్లమెంటు సభ్యులందరూ ఆలోచించి డీ లిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టకుండా నిరోధించాలని బలవంతంగా ప్రవేశపెడితే పార్లమెంటులో ఓడించాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు పార్టీలకు అతీతంగా దక్షిణ భారతీయులంతా ఒక్కటి కావలసిన అవసరం ఆవశ్యకతను దక్షిణ భారతదేశంలోని అన్ని రాజకీయ పక్షాలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు దక్షిణ భారతదేశ పార్లమెంట్ సభ్యులందరూ ఒకే త్రాటి మీద ఉండి దేశ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే. డీ లిమిటేషన్ బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదం పొందే అవకాశం ఉండదని అన్నారు దక్షిణ భారత దేశ పార్లమెంట్ సభ్యులారా ఏకంకండి భారత దేశ సమైక్యత సమగ్రతను పరిరక్షించండి అని విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడు పెద్ద మనసుతో ఆలోచించి దేశ వినాశనానికి కారణమయ్యే బిల్లులను తిప్పి కొట్టమని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు
డీలిమిటేషన్ బిల్లును తిప్పి కొట్టండి- దక్షిణ భారతదేశ ప్రాధాన్యతను కాపాడండి. రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ విజ్ఞప్తి
byThird Eye Of India
-
0
