మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యమే కీలకం: హోం మంత్రి వంగలపూడి అనిత



​అమరావతి: మహిళా సాధికారత కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకూడదని, రాజకీయాల్లోనూ వారికి సముచిత ప్రాతినిధ్యం కల్పించినప్పుడే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మహిళా నాయకత్వానికి బలమైన బాటలు వేసిందని ఆమె పేర్కొన్నారు.​పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేయడంపై హోం మంత్రి అనిత హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని, ఇది కచ్చితంగా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే నిర్ణయాల్లో మహిళలు కేవలం భాగస్వాములుగా మాత్రమే కాకుండా, నిర్ణయాధికారులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. సమాజంలో వచ్చే మార్పులో మహిళలు భాగం కావడమే కాకుండా, ఆ మార్పుకు మార్గదర్శకులుగా నిలవాలని వంగలపూడి అనిత ఆకాంక్షించారు.

Post a Comment

Previous Post Next Post

Convert JPG

✂ Image Crop & HD Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

✨ HD Preview & Resize

New Width (px): Height: 0px